Home తాజా వార్తలు కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై హరీష్‌రావు సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై హరీష్‌రావు సమీక్ష

harish-rao

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గౌరవెల్లి, తోటపల్లి జలాశయానికి మోటార్లు సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు రోజువారీ పనుల పురోగతిపై జలసౌధలో అధికారులతో పలు అంశాలపై చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో పనుల వేగం పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. అంతే కాకుండా మోటార్ల బిగింపు పనులు త్వరగా జరిగేలా చుడాలని అధికారులను ఆదేశించారు. 2018 డిసెంబర్ నాటికి తోటపల్లి పంప్ హౌజ్ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని ఇంజనీర్లు, ఏజెన్సీలకు సూచించారు. బిల్లుల చెల్లింపులు సక్రమంగా ఉండే విధంగా చూస్తామని మంత్రి  భరోసా ఇచ్చారు.