Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఇంకో ఇరవయ్యేళ్లపాటు మామయ్యే ముఖ్యమంత్రి

harish-rao

వరంగల్ అర్బన్: జిల్లాలోని ప్రకాశ్ రెడ్డిపేటలో టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం మంత్రి హరీష్ రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కెసిఆర్ కేవలం ఈ ఒక్కసారి మాత్రమే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని, మరో ఇరవయ్యేళ్లు(నాల్గుసార్లు) కూడా ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన అంతలా ప్రజాభిమానాన్ని చూరగొన్నారని చెప్పారు. కెసిఆర్ పాలనను తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారన్నారు. కావున ఆయన మరో ఇరవయ్యేళ్లపాటు సిఎంగా ఉండడం ఖాయమని హరీష్‌రావు జోస్యం చెప్పారు.

Comments

comments