Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నితిన్ గడ్కరీకి హరీశ్‌రావు లేఖ

HARISH

హైదరాబాద్ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఎపి ఎక్కువ కృష్ణా జలాలను వినియోగించుకుంటుందని ఆయన తన లేఖలో గడ్కరీకి వివరించారు. నీటి వినియోగంపై వివరాలను కూడా ఎపి తెలపడం లేదని ఆయన గడ్కరీకి ఫిర్యాదు చేశారు. నీటి విడుదల అంశంపై దృష్టి సారించేలా సీనియర్ అధికారులతో పర్యవేక్షించాలని హరీశ్‌రావు కోరారు. నీటి వినియోగంపై వివరాలు తారుమారు చేసేందుకు వీలు లేకుండా టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని ఆయన గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

Minister Harish rao Writes Letter to Nitin Gadkari

Comments

comments