Home తాజా వార్తలు కర్ణాటకతో మంత్రి హరీశ్ రావు చర్చలు సఫలం

కర్ణాటకతో మంత్రి హరీశ్ రావు చర్చలు సఫలం

Harish

హైదరాబాద్: కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర భారీనీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నారాయణపూర్ జలాశయం నుంచి ఒక టిఎంసి నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. జురాల కింద 35వేల ఎకరాల రబీ పంటను కాపాడేందుకు కర్ణాటకతో మంత్రి హరీశ్ రావు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. నీటి విడుదలపై కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి పాటిల్ తో హరీశ్ రావు మాట్లాడారు. నీటి విడుదలకు అంగీకరించన కర్ణాటక ప్రభుత్వానికి ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.