Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మిషన్ కాకతీయ పనుల్లో అలసత్వం తగదు

harish-rao

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల పురోగతిపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం ఇరిగేషన్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఫిబ్రవరి 28 తర్వాత పంపించిన ప్రతిపదనలేవి మిషన్ కాకతీయ-3 కింత మంజూరు కావని స్పష్టం చేశారు.

మూడో విడత ప్రతిపాదనలన్నీ ఈ నెలాఖరులోగా పంపించాలని తెలిపారు. మార్చిలో వచ్చే ప్రతిపాదనలను మిషన్ కాకతీయ నాల్గో విడతకు మళ్లించాలని అధికారులను సూచించారు. మూడో విడత కింద చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పంపడంలో అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పనులపై ఎలాంటి జాప్యం, అలసత్వం తగదని అధికారులను సూచించారు.

Comments

comments