Search
Friday 21 September 2018
  • :
  • :

జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు ఉగాది శుభాకాంక్షలు

harish
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : శ్రీ విళంబి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాదిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని, ఈ సంవత్సరం అన్ని రంగాల్లో పురోభివృద్ధ్దిని సాధించాలని కోరుకున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ సంవత్సరంలో ప్రజలు మెరుగైన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యేడు వర్షాలు సమృద్ధ్దిగా కురిసి రైతు కళ్లల్లో ఆనందం కనిపించాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాల మాగాణి సస్యశ్యామలం అవుతుందని, ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలకు పెద్ద పీట వేశామన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్షమని పునరుద్ఘాటించారు.

Comments

comments