Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

సిఎం పర్యటనపై కార్యకర్తలతో చర్చించిన మంత్రి

meeting1ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని హితవు
తమ తమ గ్రామాల వద్దే ఘన స్వాగతం పలకాలి.

బాన్సువాడ: ఏప్రిల్ 1వ తేదీన సిఎం కెసిఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన లో భాగంగా బాన్సువాడ ని యోజకవర్గానికి విచ్చేస్తు న్న సందర్బంగా చేయా ల్సిన ఏర్పాట్లపై సోమ వారం రాష్ట్ర వ్యవ సాయ శాఖ మం త్రి పోచారం శ్రీ నివాస్‌రెడ్డి నియోజక వర్గ ముఖ్య నాయ కులతో తన నివాసం వద్ద చర్చించారు. ఏప్రిల్ 2న బీర్కూర్ మండలం లోని తిమ్మాపూర్‌లో గల వెంకటేశ్వరాలయాన్ని సీఎం కు టుంబ సభ్యుల సమేతంగా విచ్చేస్తున్నారని మంత్రి తెలిపా రు. నిజామాబాద్ నుంచి బాన్సువాడకు రోడ్డు మార్గం ద్వా రా కనుక వస్తే మోస్రా, చందూర్, వర్ని, నస్రుల్లాబాద్ తది తర గ్రామాల వద్ద సిఎంకి ఘనంగా స్వాగతం పలకాలని నాయకులకు సూచించారు.ఈ సందర్బంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లా డుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏమిటని నాయకులు, కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. బాన్సువాడ పట్టణం లో లెదర్ పా ర్కు, పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాల స్థాపించేందుకు వి న్నపం, బీర్కూర్‌లో జూనియర్ కళాశాల, బీర్కూర్‌లో చెక్‌డ్యాం, మున్నూరు కాపు సంఘం,హన్మాజీపేట్‌లో ఒక మున్నూరు కాపు సంఘ భవనం, బాన్సువాడలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల, పాత బాన్సువాడలో జ నరల్ కమ్యూనిటీ హాల్, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, వర్ని మండలంలోని జాకోరాలో జనరల్ కమ్యూనిటీ హాల్‌లు నిర్మించాలన్నారు. బాన్సువాడ పట్టణంలో అ సంపూర్తిగా ఉన్న బంజారా భవన్ పూర్తి చేయడానికి ని ధుల గురించి, మోచి కమ్యూనిటీ హాల్, ఆరె కటిక సం ఘానికి కమ్యూనిటీ హాల్ పూర్తి చేయడానికి నిధులు, బాన్సువాడలో పోస్టుమెట్రిక్ బాలికల హాస్టల్, వర్ని మ ండలంలోని సత్యనారాయణ పురంలో జనరల్ క మ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు, రుద్రూలో జ నరల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు నిధులు, బా న్సువాడ పట్టణంలో సెంటర్ లైటింగ్ పొడగింపునకు నిధుల గురించి ముఖ్యమంత్రి ముందు ఇట్టి సమస్యల పరిష్కారానికి నిధులు రాబట్టేందుకు కృషిచేస్తాన న్నారు. ఈ సందర్బంగా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ కోసం పారిశుద్ధ నిర్వహణ కొరకు 25 వేల సైకిల్ రిక్షాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రాబోయే రెండు నెలల్లో పంపిణీ చేయనుందని మంత్రి నాయకులకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల 770 గ్రామ పంచా యతీలున్నాయని, వెయ్యి జనాభా ఉన్న గ్రామాలకు ఒ క గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమించబోతున్న ట్లు సీఎం ప్రకటించారని మంత్రి తెలిపారు. ప్రతి జీపీలో డ్రైనేజీల నిర్మాణం కొరకు నిధులు కేటా యించాలని విన్నవించనున్నట్లు, చిన్న జీపీలకు 5 ల క్షలు, పెద్ద జీపీలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరనున్నట్లు మంత్రి తెలిపారు.మంచినీటి సమస్య రాకుండా చూడాలని, ఏదేని గ్రా మంలో నీటి సమస్య ఉందని తన దృష్టికి వస్తే ఆ గ్రామ సర్పంచ్‌పై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల ఎన్నికల చేత ఎన్నుకోబడ్డ సర్పంచులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి పనులు యుద్ద ప్రాతిపదికన చేయాలన్నారు. ఎన్‌ఆర్ ఈజీఎస్ కింద ఆయా గ్రామాల్లో పశువుల తాగునీటి కొరకు నీటి తొట్టెలు నిర్మించుకోవాలని సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సు వాడ, బీర్కూర్, వర్ని, కోటగిరి మండలాల టిఆర్‌ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments