Home తాజా వార్తలు హరితహారంపై నేడు మంత్రి సమీక్ష

హరితహారంపై నేడు మంత్రి సమీక్ష

 indra karan reddy

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ ఏడాది హరితహారాన్ని మరింత పగడ్భందీగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు ప్రభుత్వ శాఖలకు తగిన దిశానిర్ధేశాలను చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఐదవ విడత హరితహారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రికరించి పలు రకాల ప్రత్యేకతతో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికలను పూర్తి చేసిన అధికారులు వాటి అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు రాష్ట్ర అటవీశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయిలో అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాల ని ఆదేశించింది. కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాకపోయినా జిల్లాలు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడిపడితే అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని అటవీశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపై మరింత స్పష్టతను ఇచ్చేందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఉన్నతస్థాయి సమీక్షకు అటవీశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు అరణ్యభవన్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

minister indra karan reddy review on haritha haram