Home తాజా వార్తలు అభివృద్ధి కోసం సిఎంలు కలిసి పని చేస్తారు

అభివృద్ధి కోసం సిఎంలు కలిసి పని చేస్తారు

Indra-Karan-Reddy

తిరుమల : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ అభివృద్ధి కోసం కలిసి పని చేస్తారని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని నైవేద్య విరామసమయం లో దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ఏపీకి కేటాయించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం కలసి పనిచేస్తున్నారని ఇది ఆనందకరమని వ్యాఖ్యానించారు.ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఖాళీగా వున్న ఏపీ భవనాలను అప్పగించడం అభినందనీయమన్నారు.

Minister Indra Karan Reddy Visits Tirumala Tirupati