Home ఆదిలాబాద్ అభివృద్ధిని చూసి ఓటేయ్యండి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అభివృద్ధిని చూసి ఓటేయ్యండి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Indrakaran Reddyనార్నూర్‌ (ఆదిలాబాద్) : రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది,సంక్షేమ పథకాలను  చూసి ఓటేయాలని రాష్ట్ర అటవీ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉమ్మడి నార్నూర్ మండలంలో నిర్వహించిన ప్రచార సభలో మంత్రి మాట్లాడారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు చేయ్యని అభివృద్ది కేసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అభివృద్ది చేసిందని అన్నారు. దేశంలో ఎక్కడ లేనంత అభివృద్ధి చేసి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ ముందంజలో నడుస్తూ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన చెప్పారు.  రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి గెడం నగేష్‌ను భారీ మెజార్జీతో గెలిపించాలన్నారు. టిఆర్ఎస్  16 లోక్ సభ స్థానాలు గెలిచి కేంద్రంలో ముఖ్య భూమిక పోషించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్ లో భారీగా చేరికలు ….
నార్నూర్ గాధిగూడ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన  సర్పంచ్‌లు,కాంగ్రెస్ నాయకులు మంత్రి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి మంత్రి   కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థిగోడం నగేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మీ, ఎంపిపి గోవింద్‌నాయక్, జడ్పిటిసి రూపావతి పుష్కర్, సర్పంచ్‌లు గజానంద్‌నాయక్ జైవంత్‌రావు, నాయకులు కాంమ్లే నాందేవ్, రాజన్న, జాలంసింగ్, సురేష్, పుషం బాదిరావ్, తుక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

Minister Indrakaran Reddy Election Campaign