Home ఆదిలాబాద్ ప్రజల వద్దకే ప్రభుత్వం

ప్రజల వద్దకే ప్రభుత్వం

Minister-Indrakaran-Redనిరుపేదలకు ఇల్లు కట్టిస్తాం
ఆలయాలకు పూర్వవైభవం
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మనతెలంగాణ/మంచిర్యాలప్రతినిధి: రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే విధం గా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే జిల్లా పునర్ విభజన చేపట్టి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కు వచ్చిన ఆయన స్థానిక హమాలివాడ సాయి బాబా ఆలయంలో దత్త జయంతి వేడుకల్లో పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాల పునర్‌విభజనతో ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు సంక్షేమ పథకాలు త్వరితగతిన ప్రజలకు అందుతున్నాయన్నారు. గతంలో విశాలమైన జిల్లాలో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కాలయాపన జరిగేదని పేర్కొ ంటూ కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన విధానం సౌలభ్యంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల మార్పిడి వలన తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినప్పటికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టిస్తామని సుమారు 2 లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణం చేపట్టేందకు ప్రభుత్వ కృషి చేస్తుందని తెలిపారు.  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధి అమలుకు నోచుకోలేదని పేర్కొంటూ సిఎం కేసిఆర్  ఈవిషయంలో  ప్రత్యేక దృష్టి సారించి, ఆలయాలకు పూర్వవైభవంతో పాటు మెరుగైన అభివృద్ధి దిశగా నిధులు కేటాయించి, ఆలయాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను ప్రజలు ఆదరిస్తుండగా ప్రతిపక్షాలు  అనవసర విమర్శలు చేస్తున్నాయని కొట్టివేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్‌నల్లాల ఓదెలు, ఎంఎల్‌సి పురాణం సతీష్‌కుమార్, ఎంఎల్‌ఏ దివాకర్‌రావు, మున్సిపల్ చైర్మన వసుంధర రమేష్, వైస్‌చైర్మన్ నల్ల శంకర్, ఎంపిపి బేర సత్యనారాయణ, జడ్‌పిటిసి ఆశలత, తదితరులు పాల్గొన్నారు.