రాజన్నసిరిసిల్ల : తెలంగాణ వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి , టిటిడి తరపున జెఇఒ శ్రీనివాస్రాజులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని రాజన్నను కోరినట్టు మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.