Search
Saturday 17 November 2018
  • :
  • :

ముస్లింల అభివృద్ధి ఘనత ప్రభుత్వానిదే

 Minister Jagadeesh Reddy Attended RamZan Festival

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : ముస్లీం, మైనార్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు వెయ్యి కోట్ల నిధులను కేటా యించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభు త్వానికే దక్కు తుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం రంజాన్ పండుగను పురస్కరిం చుకొని నల్లగొండ పట్టణంలో గల ముస్లీం మత పెద్దల నివాసాలకు విచ్చేసి ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలను తెలి పారు. మంత్రి మాట్లా డుతూ గత ప్రభు త్వా లు మైనార్టీల సంక్షే మాన్ని విస్మరిం చాయని, గత పాలకుల నిర్ల క్షం వల్లనే ముస్లీంలు అన్ని రంగాల్లో వెను కబడి ఉన్నా రని ఘాటు గా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరు వాత విద్య తోనే అభివృద్ధి సాధ్యమ వుతుందని ముస్లీం, మైనార్టీ విద్యా ర్థులు చదివేందుకు రాష్ట్రంలో 500 మైనార్టీ గురుకుల పాఠశా లలను రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ ప్రత్యేక సర్వేలు నిర్వహించి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పేదింటి మైనార్టీ కుటుంబాల్లో ఆడపి ల్లల వివాహాలు చేసేందు కు, ఆర్ధిక భరోసా కల్పిం చేందుకు రూ. లక్షా పదహార్లు అంది స్తుందని అన్నారు.ప్రతి సంవత్సరం రంజాన్ పర్వది నాన్ని పురస్కరిం చుకొని దుస్తుల పంపిణీ, బిర్యానీ భోజనాన్ని ముస్లీం సోదరులకు ప్రభుత్వం అధికారికంగా చేపడుతుందన్నా రు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ముస్లీంల వద్దకు వచ్చి మాట్లాడేందుకు అవకాశం లేకపోవ డంతో ప్రతిపక్షాలు తెలివితక్కువ మాటలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయ త్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరా డి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాలుగా జరగని అభి వృద్ధి కేవలం నాలుగు సంవత్సరాల్లోనే జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆదర్శంగా తీసుకొని వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. దేశ ప్రధాని సైతం సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను మెచ్చుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. ముస్లీం సోదరులు తెరాస ప్రభుత్వం మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్బగోని రమేష్, ముస్లీం మత పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments