Search
Friday 21 September 2018
  • :
  • :

ప్రతిపక్షాలకు జగదీశ్ రెడ్డి సవాల్…

trs-jadesh-reddy

సూర్యాపేట: వేలకోట్ల రూపాయలతో సూర్యాపేటలో అభివృద్ధి పనులు జరుగుతుంటే విపక్షాలు ఓర్వలేక విమర్శిస్తున్నాయని, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కాసరబాద్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మగాంధీ విగ్రహ ఆవిష్కరణతో పాటు రూ. రూ. 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. కొత్తగా నిర్మించిన గామపంచాయతీ భవనాన్నిజగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడారు. నియోగజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నమన్నారు. సభలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి లెక్కలను వివరిస్తామని చెప్పారు. ప్రతిపక్షాలకు సత్తా ఉంటే చర్చకు రావాలని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. జిల్లాలో గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఖర్చు చేయలేని నాయకులు, ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 3 ఏండ్లలో జరిగిందని కొనియాడారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100 శాతం నెరవేర్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

 

Comments

comments