Search
Sunday 18 November 2018
  • :
  • :

మడమతిప్పని నేత కెసిఆర్

Jupally-Krishna-Rao

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: ఉపాధ్యాయులు సిఎం కెసిఆర్‌పై నమ్మకం ఉంచి రంగారెడ్డి, హైద్రాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ఉమ్మడి ఎంఎల్‌సి అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు, రాష్ట్ర ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు అన్నారు. సోమవారం రాత్రి వనపర్తి పట్టణంలోని భగీరథ ఫంక్షన్ హాల్‌లో వనపర్తి జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇవ్వకుండానే ఉద్యోగుల సమస్యలను గుర్తించి మాట మీద నిలబడే ముఖ్యమంత్రి కెసిఆర్ అని టిఆర్‌ఎస్ ప్రభుత్వం తరపున ఎంఎల్‌సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఎంపిక చేశారని అన్నారు.

కాటేపల్లి జనార్దన్‌రెడ్డి దాదాపుగా గెలిచినట్లే నని మెజార్టీ కోసం ఓటింగ్ జరగాల్సి ఉందని వారు జోస్యం చెప్పారు. వంద శాతం విజయాన్ని ఇచ్చే హరీష్‌రావు చేతుల్లో ఎంఎల్‌సి భవివ్యం ఉందని గెలుపులో ఎలాంటి సందేహాలు లేవని ప్రతి ఉపాధ్యాయుడు ఓటు వేసి తమ సమస్యలను పరిష్కరించుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు సంబందించిన ఎన్నోసమస్యలు పరిష్కరించడం జరిగిందని గురుభక్తి కలిగిన కెసిఆర్‌కు గురువుల సమస్యలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రభుత్వ విద్యకే మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రత్యర్థులు కల్పించే అభద్రతా హామీలను నమ్మవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు యావత్ భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తారని బంగారు తెలంగాణ సాధించుకునే దశలో ఉపాధ్యాయుల సమస్యలు నిర్లక్షం చేయబోమన్నారు.

గడిచిన 70 సంవత్సరాల్లో ఎన్నోసమస్యలు ఉన్నాయని, కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏళ్లలో ఎన్నో పనులు అభివృద్ది చేసుకోవడం జరిగిందని సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఎన్నిక పూర్తవగానే పరిష్కరిస్తామన్నారు. ప్రతిపక్ష ఎంఎల్‌సి అభ్యర్థులు చెప్పేది ఒకటి చేసేది ఒకటని, వారు ఎద్దేవా చేశారు. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న రూ. 3500కోట్ల ఏరియర్స్ బకాయిలను చెల్లించేందుకు సిఎం కెసిఆర్ అనుకూలంగా ఉన్నారని వారు తెలిపారు. ఎంఎల్‌సి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఎలాంటి వ్యాపకాలు, వ్యాపారాలు లేవని 24 గంటలు ఉపాధ్యాయల సమస్యల పరిస్కారమే ధ్యేయంగా పని చేస్తానని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టితో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి, టిఆర్‌ఎస్ గద్వాల ఇంచార్జి కృష్ణమోహన్‌రెడ్డి, పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డి, టిఆర్‌టియు రాష్ట్ర అద్యక్షులు చెన్న రాములు , పిఆర్‌టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రఘురాంరెడ్డి తదితరులు ఉన్నారు

Comments

comments