Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కొత్త గ్రామపంచాయతీలపై జూపల్లి వీడియో కాన్ఫరెన్స్

Jupally Krishna Rao said that efforts are on to strengthen the local corporations

హైదరాబాద్: ఆగస్టు 2 నుంచి ఉనికిలోకి రానున్న నూతన గ్రామపంచాయతీల నిర్వహణపై సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్టారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, డిపివొలు, డిఆర్ వొలు, జడ్పీ సిఇవొలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన పంచాయతీలకు భవనాల ఏర్పాటు, ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన తదితర అంశాలను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను జూపల్లి ఆదేశించారు. గ్రామ కార్యదర్శులను జనాభా ప్రతిపాదికన హేతుబద్దికరించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామంలో నర్సరీలను వేగంవంతం చేయాలన్న జూపల్లి… ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని దిశ నిర్దేశం చేశారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 12,741 గ్రామ పంచాయితీల ఉన్నాయి. ఇందులో నూతన గ్రామ పంచాయతీలు 4,380 కాగా… 1326 గ్రామ పంచాయతీల్లో 100 శాతం ఎస్ టిలు ఉన్నారు. షెడ్యూల్డ్ గ్రామ పంచాయితీలు 1,311 ఉన్నాయి. 12,741 గ్రామ పంచాయితీల్లో 1,13,270ల వార్డులు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 721 గ్రామ పంచాయితీలు ఉండగా… అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

Comments

comments