Home తాజా వార్తలు ద్రోహుల కూటమికి బుద్ది చెప్పాలి:జూపల్లి

ద్రోహుల కూటమికి బుద్ది చెప్పాలి:జూపల్లి

jupally

 

వనపర్తి : తెలంగాణకు తీరని అన్యాయం చేసిన  టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రజలే తగిర గుణపాఠం చెప్పాలని ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం పాన్ గల్ మండలంలోని కదిరెపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ధూం ధాం కార్యక్రమానికి ఆపద్ధర్మ మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి  ప్రజలను, ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారం కోసం అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ అమలుకునోచుకోని హామిలతో కాంగ్రెస్ కూటమి గ్రామాలకు వచ్చేందుకు సిద్దం అవుతుందని, అలాంటి పార్టీలను తరిమికొట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 67 సంవత్స రాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని అభివృద్ధి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను అణచివేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, అలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాల న్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలను ఓట్లడిగే హక్కున్న ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ పార్టీఅని ఆయన పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేసే కెసిఆర్‌ను మరోసారి సిఎం చేసేందుకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

Minister Jupally krishna rao speech at election campaign