Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

పంచాయతీ ఎన్నికలపై జూపల్లి సమీక్ష

Minister Jupally Review on Panchayat Elections

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలపై మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సమీక్ష చేశారు. జూన్ 10వ తేదీ నాటికి పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రిజర్వ్ సర్పంచి స్థానాల సంఖ్యను జిల్లాల వారీగా ప్రకటించనున్నారు. జిల్లా స్థాయిలో రిజర్వ్ వార్డు సభ్యుల సంఖ్యను కలెక్టర్ ప్రకటిస్తారని జూపల్లి తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జూన్ పదో తేదీ లోగా నర్సరీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Minister Jupally Review on Panchayat Elections

Comments

comments