Home జాతీయ వార్తలు ఉద్రిక్త గిరిజాపూర్

ఉద్రిక్త గిరిజాపూర్

Girajapur_manatelanganaమన తెలంగాణ / మహబూబ్‌నగర్: కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం అక్ర మంగా చేపట్టిన గిరిజాపూర్ ప్రాజెక్టును మంత్రి జూపల్లి కృష్ణారావు, టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి మంగళవారం నాడు అతికష్టం మీద ఉద్రిక్త పరిస్థితుల మధ్య సందర్శించారు. మొదట్లో వారిని కర్ణాట క పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించడంతో మంత్రి బృందం దాదాపుగా గంటసేపు కృష్ణా నది బ్రిడ్జిపైనే నిలిచిపోవాల్సి వచ్చింది. కర్ణాటక పోలీసులతో మంత్రి, ఎంపి చర్చలు జరిపినప్పటికీ చాలా సేపటి వర కు ఫలితం లేకపోయింది. అవసరమైతే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించ డంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అనంతరం కర్ణాటక అధికారులు దిగివ చ్చారు. ప్రాజెక్టును సందర్శించడానికి కేవలం నలుగురినే అనుమతిస్తామని చెప్పారు. దానితో మంత్రి, ఎంపి, ఇద్దరు మీడియా ప్రతినిధులతో కలిసి ప్రాజెక్టు ను సందర్శించారు. ప్రాజెక్టు సందర్శిం చడానికి వెళ్లేందుకు వచ్చిన మంత్రి బృం దంతో కర్ణాటక జిల్లా రాయచూర్ ఎంపి బివి.నాయక్, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, అడిషనల్ ఎస్‌పి పాపయ్య, అసిస్టెంట్ కలెక్టర్ మారుతి, డిఎస్పి చంద్రశేఖర్ వాల్గర్, సిఐ బస్వరా జ్‌లు మంత్రి బృందంతో చర్చించారు. ప్రాజెక్టును సందర్శించిన అనంత రం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపి జితేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ సిడబ్లుసి, కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని దీని వల్ల పాలమూరు జిల్లాకు చుక్కనీరు కూడా రావని, జిల్లాలోని రైతాంగానికి సాగునీరు అందే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  కర్ణాటక ప్రభుత్వం జలదోపిడీ చేస్తుందన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశరావుతో చర్చంచి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కృష్ణానదిపై రోడ్డునిర్మాణం చేపట్టి రాయచూర్ జిల్లాకు తాగునీరు, జిల్లాలో థర్మల్ విద్యుత్‌కు నీటిని వాడుకునేందుకు మూడు మీటర్ల ఎత్తులో ప్రాజెక్టును నిర్మించి 0.4 టిఎంసిల నీటిని మాత్రమే వాడుకుంటామని కర్ణాటక అకారులు చెబుతున్నారు.