Search
Sunday 18 November 2018
  • :
  • :

విద్యాశాఖ అధికారులతో మంత్రి కడియం శ్రీహరి సమీక్ష

KADIAM

హైదరాబాద్‌: సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల వల్ల చాలా పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వెంటనే విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి కడియం అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోపు మేనేజ్ మెంట్ల వారిగా విద్యావాలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు అధికారులకు సూచించారు. జిల్లాల కలెక్టర్లు, డిఇఒలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యావాలంటీర్ల నియామకం, విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్ పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీపై దృష్టి పెట్టి వెంటనే అవి విద్యార్థులకు అందించాలన్నారు. అలాగే జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సాధారణ బదిలీల వల్ల డిస్ట్రబ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కౌన్సిలింగ్ నిర్వహించి నియామకాలు చేపట్టాలని చెప్పారు. జూనియర్, డిగ్రీ కాలేజీల గుర్తింపు ప్రక్రియ వెంటనే పూర్తి చేసి, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను విద్యాశాఖ వెబ్ సైట్లో పొందుపర్చాలని, సంబంధిత జిల్లా విద్యాధికారులకు అందించాలని అధికారులకు  మంత్రి కడియం చెప్పారు.

Comments

comments