Search
Friday 21 September 2018
  • :
  • :

రేపు రాజన్న సిరిసిల్లలో కెటిఆర్, నాయిని పర్యటన

KTR Laid Foundation Stone for Ferring Laboratories Company

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో సోమవారం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటి, శాఖ మంత్రి కెటిఆర్ పర్యటించున్నారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో నూతనంగా రూ.7.74 కోట్లతో నిర్మించిన ఐటిఐ కళాశాలను వారు ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకొని కళాశాల బిల్డింగ్ ను మంత్రులు నాయిని, కెటిఆర్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా హైదరబాద్‌కు తిరిగి రానున్నారు. ఈ పర్యటనకు ప్రజాప్రతినిధులు, అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని పేర్కొన్నారు.

Comments

comments