Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎపిలో టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు…

Minister KTR Comments on Congress Leaders

షాద్‌నగర్ : ఎపిలోనూ టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని తెలంగాణ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ వంటి సమర్థ సిఎం తమకుంటే బాగుండేదని ఎపి ప్రజలు అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన షాద్‌నగర్‌లో పర్యటించారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ భవనానికి, 1700 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చనిపోయిన వారి పేర్ల మీద కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Minister KTR Comments on Congress Leaders

Comments

comments