Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

Minister KTR Comments on Congress Leaders

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు సోమవారం అధికార టిఆర్‌ఎస్ చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆయన చెప్పారు. కుటుంబ పాలనపై కాంగ్రెస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ పాలనను ప్రధాని నరేంద్రమోడే మెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే నెంబర్‌వన్ సిఎంగా కెసిఆర్‌కు పేరు రావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాని, జైలుకు కూడా వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు గెలిపిస్తేనే తాను ఎంఎల్‌ఎ అయ్యాయని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.  దేశంలో ఎక్కడా జరగని విధంగా సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. డబ్బులు పంచాల్సిన అవసరం తమకు లేదని, ప్రజలే స్వచ్ఛందంగా సభకు తరలిరానున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Minister KTR Comments on Congress Leaders