Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రైతులకు శాసించే స్థాయి రావాలి : కెటిఆర్

Minister KTR Comments on Farmers

రాజన్న సిరిసిల్ల : రైతులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు. వ్యవసాయంలో ఉన్న ఆనందం మరో వృత్తిలో ఉండదని ఆయన పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో రైతు బంధు పథకంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించినట్టు ఆయన చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Minister KTR Comments on Farmers

Comments

comments