Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మహేష్, సచిన్‌కు కెటిఆర్‌ ‘గ్రీన్‌ ఛాలెంజ్‌’

KTR Green challenge to Mahesh Babu and Schin Tendulkar

హైదరాబాద్‌: మొక్కల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ‘హరితహారం’. దీనిలో భాగంగా నాల్గో విడత కార్యక్రమం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. కాగా, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, ప్రభుత్వాధికారులు పాల్గొంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మరింత ప్రచారం కోసం సినీ సెలబ్రిటీలు ఇందులో పాల్గొనాలి. అందుకే సిఎం కెసిఆర్ కుమార్తె,  ఎంపి కల్వకుంట్ల కవిత తాజాగా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లాగే ‘గ్రీన్ ఛాలెంజ్’ను తెరపైకి తెచ్చారు. కొన్ని రోజుల కిత్రం కవిత కొన్ని మొక్కలు నాటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఆమె విసిరిన సవాల్‌ను ఈ దర్శకధీరుడు స్వీకరించారు. హరితహారంలో భాగంగా మర్రి, గుల్మోహర్, మలబారు చెట్లను తన ఫామ్‌హౌస్‌లో నాటిన రాజమౌళి… దీనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం హరిత సవాల్ కార్యక్రమం ఉద్ధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

పలువురు సెలబ్రిటీలు మొక్కలు నాటి ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు మొక్కలు నాటాలని సవాల్ విసిరుతున్నారు. తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విసిరిన సవాల్‌ను స్వీకరించిన పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ మరో ఐదుగురు ప్రముఖులకు హరిత సవాల్ విసిరారు. రాజమౌళి సవాల్‌కు స్పందించిన కెటిఆర్, గురువారం టిశాట్ ఆవరణలో నాలుగు మొక్కలు నాటారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపిన మంత్రి… సినీనటుడు మహేష్ బాబు, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయికి హరిత సవాల్ చేశారు. ఒక్కొక్కరు నాలుగు మొక్కల చొప్పున నాటాలని మంత్రి కెటిఆర్ కోరారు.

Comments

comments