Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విజయ్ యు ఆర్ ది రాక్‌స్టార్: కెటిఆర్

KTR-with-Arjun-Reddy

హైదరాబాద్: పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఇటీవలె విడుదలై ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్లు కూడా కొల్లగొడుతోంది. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ యువతను బాగా ఆకట్టుకుంటుంది. అర్జున్ రెడ్డిగా విజయ్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా ఈ మూవీని చూసిన రాష్ట్ర ఐటి, మున్సిపల్ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా హీరో విజయ్‌ దేవరకొండను రాక్‌స్టార్ గా అభివర్ణించారు కెటిఆర్.

Comments

comments