Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

బిల్ట్ తెరవడానికి సిద్ధం

minister KTR Speech About Bilt Industry

మన తెలంగాణ/హైదరాబాద్: ఖాయిలా పడిన బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్ ) పరిశ్రమ పునరుద్ధరణకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. పరిశ్రమ పునరుద్ధరణ పనులను ప్రారంభించేందుకు వారం రోజుల్లోగా తగిన ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో గురువారం బిల్ట్ పరిశ్రమ పునరుద్దరణపై పరిశ్రమ యాజమాన్యం, పరిశ్రమల శాఖ అధికారులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఖాయిలా పడిన పరిశ్రమను పునరుద్దరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలనే లక్షం తో పరిశ్రమ యాజమాన్యం కోరిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తున్నదని ఆయన తెలిపారు. భవిష్యత్‌లోనూ పరిశ్రమ యాజమాన్యానికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. పరిశ్రమను పునరుద్దరించాలని యాజమాన్యాన్ని , ఈ ప్రక్రియలో సహకరించాలని కార్మికులను కోరారు. ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా వ్యవహరిస్తుందని , కార్మికుల బతుకులు బాగు చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో భాగంగానే ఖాయిలా పడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పరిశ్రమలను తిరిగి పునరుద్ధరిస్తే ప్రభుత్వం తరఫున మరిన్ని సబ్సిడీలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గిరిజనా భివృద్ధి, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల బతుకుదెరువు కోసం వెంటనే బిల్ట్ పరిశ్రమను తెరవాలని కెటిఆర్‌ను  మంత్రి చందూలాల్  కోరారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, బిల్ట్ పరిశ్రమ ప్రతినిధి అగర్వాల్, శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments