Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్

kadiyam

మన తెలంగాణ/కార్పొరేషన్: గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని ముఖ్యమంత్రి నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నగర మేయర్ నన్నపునేని నరేందర్‌తో కలిసి రాష్ట్ర పురపాలక, ఐటి శాఖమంత్రి కె.తారకరామారావు బుధవారం శాయంపేటలో శంకుస్థాపన చేశారు. వాటితో పాటు రూ.3222.40 లక్షలతో నిర్మించనున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు.
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ
కార్పొరేషన్ పరిధిలో గల 2259 సంఘాలకు రూ.2.28 కోట్ల వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు, మంత్రి చందులాల్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎంఎల్‌ఎలు వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రా జయ్య, ఆరూరి రమేష్ తది తరులు పాల్గొ న్నారు.
ఈ నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగింపు… వరంగల్ నగరంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఇప్పటి 171 రూపాయల ఆదాయం కుడాకు వ చ్చిందన్నారు. కుడాలో మొత్తం 28000 దరఖాస్తులు రాగా వీటిలో 5వేల దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయినందును వాటి పరిష్కారం కోసం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగిస్తున్నామని, ఇది కేవలం వరంగల్‌కు మాత్రమే ఇస్తు న్నట్లు కెటిఆర్ వెల్లడించారు. డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
15 చోట్ల వెండింగ్ జోన్స్ ఏర్పాటు… వరంగల్ నగరంలోని వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా వెండింగ్ జోన్స్‌ను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే నగరంలో 15 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందని, కొన్ని చోట్ల లిటిగేషన్, లీగల సమస్యల వల్ల నిదానంగా జరుగుతున్నాయి. మున్సిపల్ కమిసనర్ ప్రత్యేక మైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరంగల్ నగరానికి సంబంధించిన కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (సిటిఎస్) కోసం వరంగల్‌కు సమగ్రమైన రవాణకు సంబంధించిని అధ్యయనం చేయాలన్నారు. స్మార్ట్ సిటిలో భాగంగా నగరంలో ఎన్ని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయనేది సర్వే చేయాలని, ఇప్పటికే హైదరాబాద్‌లో చేసి ఐటిఎంఎస్‌ను ప్రవేశపెట్టామన్నారు. వరంగల్ నలువైపుల ఉన్న పారెస్టు బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, పెరుగుతున్న 2041 35లక్షల మంది ఉండబోతున్నారు. వరంగల్ నగరానికి బయట వైపున మడిపల్లి వద్ద 200 ఎకరాల భూమిని సేకరించారని, అనంత సాగర్ వద్ద కొంత భూమిని సేకరించారు. లాండ్ పూలింగ్ పాలసీ కింద 500 ఎకరాల భూమిని సేకరించాలన్నారు. దీని వల్ల ఇన్నర్ రింగ్ రోడ్ , ఔటర్ రింగ్ రోడ్, టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడం, అదే విధంగా ఇన్నర్ రింగ్‌రోడ్‌లో ప్రజా రవాణను అభివృద్ధి చేయడం, హకర్స్‌ను రోడ్లపై లేకుండా చేయాలన్నారు. ఉపాధి దెబ్బతగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

comments