Home తాజా వార్తలు బీమాతో రైతుకు ధీమా

బీమాతో రైతుకు ధీమా

Minister Laxma Reddy Comments on Farmers

మహబూబ్‌నగర్ : వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు బీమా వర్తింపు అవుతుందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే, పది రోజుల్లోనే బీమా సొమ్మును చెల్లిస్తారని ఆయన పేర్కొన్నారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలోని హామాజీపూర్, కొల్లూరు, పోమాల్ గ్రామాల్లో ఆయన రైతులకు రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి రైతుకు బీమా ప్రీమియం రూ.2,500లను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. బీమా పథకం కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లను సిద్ధం చేసిందని ఆయన చెప్పారు. రైతుకు పట్ట పెట్టుబడి, రైతు బీమా దేశంలోనే చరిత్ర సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు సంక్షేమమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

Minister Laxma Reddy Comments on Farmers