Home తాజా వార్తలు ఆర్‌టిసి పనితీరుపై మంత్రి సమీక్ష

ఆర్‌టిసి పనితీరుపై మంత్రి సమీక్ష

MahenderReddy

హైదరాబాద్ : ఆర్‌టిసి పనితీరుపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మంగళవారం సమీక్ష చేశారు.ఈ సమీక్షలో ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్‌టిసి అధికారులు పాల్గొన్నారు. ఆర్‌టిసి రీజియన్లు, సర్వీసులు, ప్రభుత్వం నుంచి రాబడులు – నష్టాలపై వారు చర్చించారు. ఆర్‌టిసిలో నష్టాలను తగ్గించి లాభాల్లో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ రెండు వేల కోట్ల ఆర్థిక సహాయం అందించడం వల్లనే ఆర్‌టిసి మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు. ప్రజా రవాణాలో దేశంలోనే ఆర్‌టిసి మెరుగ్గా ఉందన్నారు. సంస్థలో కొత్త బస్సుల కొనుగోలు చేస్తామని, ఈ క్రమంలో నిధుల కోసం సిఎం కెసిఆర్‌కు నివేదిక ఇస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్‌టిసి బస్సులోనే ప్రయాణించాలని ఆయన సూచించారు.

Minister Mahender reddy Review on TS RTC Performance