Home తాజా వార్తలు లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు టిఆర్‌ఎస్‌వే : మల్లారెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు టిఆర్‌ఎస్‌వే : మల్లారెడ్డి

Minister Malla Reddyసికింద్రాబాద్ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ 16 ఎంపి స్థానాలను గెలుచుకుని తీరుతుందని మంత్రి మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం బోయిన్‌పల్లిలో టిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశ ప్రజలు  తెలంగాణ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. బుధవారం కరీంనగర్‌ లో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో జరిగే పార్లమెంటరీ స్థాయి సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్‌ మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంఎల్ఎలు  బేతి సుభాష్‌ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎంఎల్ సిలు, టిఆర్ఎస్ నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Minister Malla Reddy Comments Lok Sabha Elections