Home Default 16 స్థానాల్లో టిఆర్‌ఎస్‌దే విజయం : మంత్రి మల్లారెడ్డి

16 స్థానాల్లో టిఆర్‌ఎస్‌దే విజయం : మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddyతిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మల్లారెడ్డికి వేదపండితులు వేదశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి వారిని దర్సించుకోవడం చాలా సంతోషంగా ఉందని మల్లారెడ్డి తెలిపారు. తెలుగు ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని ప్రార్థించానని ఆయన చెప్పారు. తెలంగాణలోని 16 ఎంపి స్థానాలు టిఆర్ఎస్ గెలిచే విధంగా దీవించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 16 లోక్ సభ స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉండనున్నాయని ఆయన వెల్లడించారు.

Minister Mallareddy Visits Tirumala