Home జోగులాంబ గద్వాల్ అలంపూర్ విద్యపరంగా ఎదగాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

అలంపూర్ విద్యపరంగా ఎదగాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

Minister Singireddy Niranjan Reddy

 

అలంపూర్: విద్యాపరంగా అలంపూర్ నియోజవర్గం మరింత ఎదగాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉండవల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రయాగ్ స్కూల్ అఫ్ ఎక్‌స్లెన్ని స్కూల్‌ను జడ్పిచైర్మన్ బండారీ భాస్కర్, ఎంఎల్ఎ అబ్రహంలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి సమాజంలో విద్యరంగానికి పెద్ద పీట వేయడం ద్వారా రాష్ట్రం, దేశం ఆభివృద్ది చెందుతుందన్నారు. రాష్ట్ర విభజన జరగక ముందు అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్ధులు కర్నూల్‌లో చదివేవారని రాష్ట్ర విభజన తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగ నియమాకాలలో నాన్‌లోకల్ విద్యార్ధులుగా పరిగణించబడుతున్నారని, స్ధానికత సమస్య తీవ్రంగా ఉందన్నారు. తాను గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షునిగా ఉన్న సమయంలో స్థానికత సమస్యాలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని తెలిపారు. అలంపూర్ విద్యార్ధులు ఉన్నత విద్య కొసం ఇతర ప్రాంతాలకు పోకుండా పాఠశాలల నెలకోల్పడం పట్ల యాజమాన్యంను అభినందించారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని విద్యను నేర్పించాలని ఆయన యాజమాన్యంకు కోరారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపిపి సుదర్శన్‌గౌడ్, జయరాములు తదితరులు పాల్గొన్నారు.

Minister Niranjan Reddy started Prayag School