Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఆహ్లాదంగా బొటానికల్ గార్డెన్

Minister of KTR who started the Botanical Garden

బొటానికల్ గార్డెన్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హుషారు నింపిన కెటిఆర్ పర్యటన
దాదాపు 2 గంటల సేపు గార్డెన్‌లోనే…

మన తెలంగాణ /మియాపూర్ : నూతనంగా హంగులతో కొత్త శోభను సంతరించుకున్న బొటానికల్ గార్డెన్‌లో రాష్ట్ర మం త్రి కెటిఆర్, మంత్రి జోగు రామన్న, ఇతర నేతలు, అధికారులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో హుషారుగా పర్యటించారు. నేతలందరిని పలకరిస్తూ ఎక్కడిక్కడ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. సుమారు 2 గంటలకు పైగా ఆయన బొటానికల్ గార్డెన్‌లో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో పాటు ఆయనకు పలు అంశాలు వివరించారు. బొటానికల్ గార్డెన్‌లో డస్ట్ బిన్‌లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన పర్యటన శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ నేతలలో నూతన ఉత్తేజాన్ని నింపింది. గత ప్రభుత్వం ఇందులో మల్టిప్లెక్స్ నిర్మిద్దామనుకుంటే గజం జాగలేకున్నా భవనాలు కడుతున్న చోట ఈ పార్కు ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. శేరిలింగంపల్లి డివిజన్‌లోని బొటానికల్ గార్డెన్ ఆధునీరకరణతో పాటు సుందరీకరణ వాకర్స్, చిన్నారుల కోసం వివిధ రకాల ఆట వస్తువులు, జిమ్, గాల్ఫ్, కాటేజస్, మొక్కలు, స్కేటింగ్, విజ్ఞాన కేంద్రం, బాంబు హట్, వాకింగ్ ట్రాక్‌లను మంత్రి కెటీఆర్ ప్రారంభించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బ్యాటరీ కారును నడిపి నాయకులలో మరింత ఉత్సాహాని నింపారు. మొదట బొటానికల్ గార్డెన్ ముఖద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి గేటును తెరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. వృద్ధుల కొరకు ఏర్పాటు చేసిన బ్యాటరీ కారులో మంత్రి కెటీఆర్‌తో పాటు అటవీశాఖ మంత్రి జోగు రామన్న, టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఎండీ చందన్ మిత్రా, ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలతో కలిసి గార్డెన్‌లోని వాకింగ్ ట్రాక్‌లో నడిపుతూ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన గాల్ఫ్, విజ్ఞాన కేంద్రం, జిమ్, బాంబు హట్, చిన్నారుల ఆట వస్తువులు, కాటేజస్‌లను ప్రారంభించారు. అందరితో కలిసి హుషారుగా మంత్రి కెటీఆర్ కలివిడిగా ఉండి గార్డెన్ పరిసరాలను తిలకించారు. అటవీ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులకు, సిబ్బందికి గార్డెన్ ఆధునీకరణతో పాటు సుందరీకరణ అతితక్కువ సమయంలో రూపొందించినందుకు, వాకర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలు అందించినందుకు అభినందించారు. ఈ పర్యటనలో జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ హరిచందన, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్, ఎమ్మెల్సీ భానుప్రకాష్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్, మేక రమేష్, జానకిరామరాజు, దొడ్ల వెంకటేష్ గౌడ్, అటవీ శాఖ అధికారులు, వార్డు మెంబర్ చాంద్‌పాషా, నాయకులు పాల్గొన్నారు.

Comments

comments