Home తాజా వార్తలు రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

MahenderReddy

హైదరాబాద్ : రవాణా శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జెటిసిలు, డిటిసిలు హాజరయ్యారు. రవాణా శాఖకు వస్తున్న ఆదాయం, రోడ్డు భద్రతపై మంత్రి జిల్లాల వారీగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ఆర్‌టిసి లాభాల బాట పట్టిందని ఆయన చెప్పారు. ఆర్‌టిసి నష్టాల నుంచి గట్టెక్కేందుకు అధికారులు సహకరించాలని ఆయన సూచించారు. రవాణా శాఖ అధికారులు ఆర్‌టిసితో సమన్వయంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 Minister Reviewed with Transport Department Officials