Home తాజా వార్తలు ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ 19 ప్రాజెక్టుల సమ్మేళనం’

‘కాళేశ్వరం ప్రాజెక్ట్ 19 ప్రాజెక్టుల సమ్మేళనం’

Minister Sri Harish Rao addresses Kaleshwaram project

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు 19 ప్రాజెక్టుల సమ్మేళనమని భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం జాతీయ మీడియా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ లో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 6వేల మంది ఇంజనీర్లు, 25వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకూ 3.20 కోట్ల సిమెంట్‌ బస్తాలు వాడామని,  203 కిలోమీటర్ల అండర్‌ టన్నెల్‌ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.