Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ

talasani-srinivas-yadav

హైదరాబాద్: తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీ ప్రముఖులు, ‘మా’ ప్రతినిధులు శనివారం సాయత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పోలీసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలోని వివాదాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్చలు జరిపారు. తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీ పెద్దలు అన్ని రంగాల వారితో ఈ రోజు విస్తృతస్థాయి సమావేశం జరిపిన విషయం విదితమే. అన్నపూర్ణ స్టూడియో సెవెన్ ఎకర్స్ లో జరిగిన  ఈ భేటీలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నిర్మతలు, మండలి, నటీనటుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా వచ్చారు. సమావేశం అనంతరం సినిమా పెద్దలు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Comments

comments