Home తాజా వార్తలు జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూంలో మంత్రి తలసాని

జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూంలో మంత్రి తలసాని

TALASANIహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసుద్దీన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్‌లు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వర్షం సృష్టించిన బీభత్సం పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను మంత్రి నేరుగా స్వీకరిస్తున్నారు. గాలి, వాన బీభత్సం బాధితులు నెంబర్ 040-21111111కు ఫోన్ చేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కలెక్టర్ల పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అంతేకాకుండా యుద్ధప్రాతిపదికన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ జరుగుతుందని తెలిపారు. కూలిన చెట్లను జిహెచ్‌ఎంసి సిబ్బంది తొలగిస్తున్నారని వెల్లడించారు.