Home తాజా వార్తలు మహాకూటమి ఓ దొంగల కూటమ: తలసాని

మహాకూటమి ఓ దొంగల కూటమ: తలసాని

ministr

మియాపూర్ : కాంగ్రెస్, టిడిపి తదితర పార్టీలు ఏర్పాటు చేసుకున్న మహాకూటమి ఓ దొంగల కూటమీ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం హఫిజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తా వద్ద ఉన్న సత్యభారతి కన్వెక్షన్ సెంటర్‌లో హఫిజ్‌పేట్ డివిజన్ టిఆర్‌ఎస్ విస్తృత సమావేశం కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇంచార్జి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ ఎంఎల్ఎ తెరాస పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులు భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. సిఎం కెసిఆర్ నాలుగున్నర సంవత్సరాలలో నిరుపేదలకు వివిధ సంక్షేమ పథకాలను అందించారన్నారు. నిరంతరం ఆయన బంగారు తెలంగాణ సాధనకై కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే టిఆర్‌ఎస్ మెనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగ భృతిపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నామన్నారు. కాంగెస్, టిడిపి పార్టీలు నాయకులు ఏర్పాటు చేసిన కూటమీ అది ఒక దొంగల కూటమీ విమర్శించారు. 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఆయన స్పష్టం చేశారు. నగరంలో టాఫ్రిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్, మెట్రో రైలు, సిసి రోడ్లు, అండర్ బ్రిడ్జి రోడ్లు నిర్మాణం చేస్తున్నామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గతంలో విద్యుత్, మంచినీరు, రోడ్డు, పరిశ్రమలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాలలో హైటెక్ సిటిలో వివిధ రకాల సంస్థలు ముందుకు వస్తున్నాయనన్నారు. నిరంతరం విద్యుత్, పైప్‌లైన్ ద్వార ఇంటింటికి మంచినీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడమే సరిపోయిందని, నగర అభివృద్ధి జరగలేదని తలసాని మండిపడ్డారు.  ఈ విస్తృతి సమావేశంలో కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకట్‌ష్ గౌడ్, జిలా గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కార్పోరేటర్ అశోక్ గౌడ్, ఎండి.అక్తర్, కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి, ప్రశాంత్, మల్లారెడ్డి బాబు మల్లేష్, గౌతం గౌడ్ తదతరులు పాల్గొన్నారు.

Minister Talasani srinivas yadav fire on Mahakutami