Search
Saturday 22 September 2018
  • :
  • :

మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం

Minister-Talasani-Vehicle-m

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కీసర సమీపంలో ప్రమాదానికి గురైంది. శామీర్‌పేట్ నుంచి కీసరకు వెళ్తుండగా ఔటర్ రింగ్‌రోడ్డుపై మంత్రి వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలసానికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఇదే వాహనంలో ఉన్న మేడ్చల్ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డికి మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. దాంతో వెంటనే ఆయనను చికిత్స కోసం కీసరకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.

Minister Talasani Srinivas Yadav Vehicle Met with an Accident At ORR.

Comments

comments