Home జిల్లాలు కులవృత్తులకు పెద్దపీట:మంత్రి తలసాని

కులవృత్తులకు పెద్దపీట:మంత్రి తలసాని

mbnr

తెలంగాణ/పాలమూరు: కురుమ యాదవుల కులవృత్తి కాపాడింది తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని జేజేఆర్ పంక్షన్ హాల్‌లో నిర్వహించిన కురుమ యాదవ శంఖారావం సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం గాని, కాంగ్రెస్ కానీ సరైన భద్రత కురుమ యాదవులకు కల్పించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం 5 శాతం పెట్టుబడితో 95 శాతం ప్రభుత్వ సబ్సిడీ ఇస్తూ గొల్లల అభివృద్ధి కాంక్షించేది టిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. దేశంలో గొర్రెల పంపిణీ చేసింది తెలంగాణ ప్రభు త్వమేనని, గత పాలకులు ఇళ్ల, భూముల కాగితాలు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈనెల 29న జరిగే కురుమ యాదవ శంఖారావ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నేను గొల్ల కురుమగా మారుతా…ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్…
గొల్ల కురుమల అభివృద్ధి కోసం నేను కూడా గొల్ల కురుమగా మారు తానని ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నమ్మకానికి మారుపేరు యా దవ కురుమలన్నారు. ఎవ్వరడిగినా పుట్టని అప్పు కురుమ యాదవు లకు పుడుతుందని అది వారి నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రపంచం మొత్తం కొలిచే తిరుమల వేంకటేశ్వరస్వామి తలుపులు తెరిచే అదృష్టం వీళ్లకే కలగడం మహాభాగ్యమన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎంఎ ల్‌ఎ అంజయ్యయాదవ్, సంఘం నాయకులు బైకాని శ్రీనివాస్‌యాదవ్, మల్లేష్, సాయిలు, శాంతన్న, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.