Home తాజా వార్తలు నాడు ఎన్‌టిఆర్.. నేడు కెసిఆర్

నాడు ఎన్‌టిఆర్.. నేడు కెసిఆర్

tummala

భద్రాద్రి కొత్తగూడెం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాదిలో మీడియాతో మాట్లాడుతూ… ఆనాడు ఎన్‌టిఆర్, నేడు కెసిఆర్ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారని తెలిపారు. రైతుబంధు పథకంతో సిఎం కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా రైతుబంధు అమలుచేయాలనే డిమాండ్ పెరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక సీతరామ ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని తుమ్మల స్పష్టం చేశారు.