Home ఖమ్మం బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి తుమ్మల

బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి తుమ్మల

Tummala-Nageshwara-Raoఖమ్మం: సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెం వద్ద బస్సు కాలువలో పడి 10 మంది మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంఎల్‌సి బాలసాని, ఎంఎల్‌ఎ అజయ్ పరామర్శించారు. తుమ్మల మీడియాతో మాట్లాడుతూ…. ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రభుత్వమే క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందిస్తోందని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన చోట నూతన బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.