Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి యూనియన్లతో సాగుతున్న చర్చలు

ts

సిబ్బంది సంఘాల డిమాండ్లను సిఎం కెసిఆర్‌కు వివరించిన మంత్రులు
ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్న టిఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావేనని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సంస్థ బాగు కోసం తాము కొన్ని సూచన లు చేశామని, డిమాండ్లపై ప్రభుత్వ స్పందనను బట్టి తమ స్పందన ఉంటుందని గుర్తింపు సంఘం టిఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. తమ డిమాండ్లను మంత్రుల కమిటీకి తెలియజేశామని, మంత్రుల కమిటీ నేరుగా సిఎంకు తమ డిమాండ్లను వివరించిందన్నారు. తాము నేరుగా సిఎంతో చర్చలు జరపలేదని, మంత్రులతో మాత్రమే చర్చలు జరిపామని అశ్వత్థామరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని, ఆయన నిర్ణయం వెలువడిన తర్వాత సమ్మెపై తమ స్పందనను తెలియజేస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందు మం త్రుల కమిటీ కడియం శ్రీహరి నేతృత్వంలో టిఎంయుతో భేటీ అయింది. మూడు గంటలకు ప్రగతి భవన్ నుండి మంత్రుల కమిటీ బయటికి వచ్చింది. టిఎంయు డిమాండ్లను సిఎంకు వివరిస్తామని, తుది నిర్ణయం సిఎందేనని ఈ సందర్భంగా మంత్రులు కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఉదయం నుండీ టిఎంయూతో చర్చొప చర్చలు : ఆర్‌టిసి కార్మికుల సమ్మె పిలుపు నేపథ్యంలో శనివారం ఉడయం 10 గంటలకు మంత్రుల కమిటి సచివాలయంలో భేటీ అయింది. మరో మారు గుర్తింపు సంఘం టిఎంయూతో చర్చలు జరిపింది. ముందు సమ్మెపై ఎలాంటి వ్వూహాన్ని అనుసరించాలన్న అంశంపై టిఎంయూ గౌరవాధ్యక్షులు హరీష్ రావుతో వారు భేటీ అయ్యారు. హరీష్‌తో భేటీ విషయం తెలుసుకున్న కెటిఆర్, తుమ్మల, ఈటల రాజేందర్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో కూడిన స్ట్రాటజిక్ కమిటి గుర్తింపు సంఘాన్ని కడియం శ్రీహరి నివాసానికి పిలిపించుకుని కడియం అధ్యక్షతన చర్చలు జరిపింది. ఆర్‌టిసి అప్పులను ప్రభుత్వం సింగిల్ సెటిల్‌మెంట్‌లోనే మాఫీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ప్రతి నెలా చెల్లించాలని, మోటార్ వెహికిల్ టాక్స్ నుండి ఆర్‌టిసికి మినహాయింపు నివ్వాలని, ఆర్‌టిసి వాడుతున్న డీజిల్‌పై టాక్స్‌లను రద్దు చేయాలని కోరారు. కార్మికులు సమ్మెకు వెళ్తే ఎస్మాకు వెళ్లే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని కూడా తెలిపినట్లు తెలుస్తోంది. అలాగే సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయాలు ఎలా? అన్న అంశంపై కూడా ఈ స్టాటజిక్ కమిటి చర్చించింది. యూనియన్ నేతలు తమ డిమాండ్లపై తగ్గక పోవడంతో కడియం నివాసం నుండి ప్రగతి భవన్‌కు మంత్రులంతా బయలు దేరి వెళ్లారు. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, హరీష్ రావు, కెటి. రామారావుతో పాటు ఆర్‌టిసి ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ ఈ బృందంలో ఉన్నారు. టిఎంయూ ప్రతిపాదనలను మంత్రులు ఈ సందర్భంగా ప్రగతి భవన్లో సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో సిఎం కెసిఆరే నేరుగా రంగంలోకి దిగారు. టిఎంయూ నాయకులతోచర్చలు జరిపి సారాంశాన్ని తనకు వెల్లడించాలని ఆదేశించారు. ఇప్పటికే ఆర్‌టిసి నష్టాల్లో ఉన్న అంశాన్ని సంఘాలకు గట్టిగా చెప్పాలని మంత్రుల కమిటికీ దిశానిర్ధేశం చేశారు. అలవికాని డిమాండ్లతో సమ్మెకు వెళ్తే నష్టపోయేది ఆర్‌టిసి సంస్థ, కార్మికులేనని, ప్రజలు కాదని విడమరిచి వివరించాలని కోరారు. అయినా డిమాండ్లపై గుర్తింపు కార్మిక సంఘం నేతలు అశ్వత్థామ రెడ్డి, థామస్ రెడ్డిలు వెనక్కి తగ్గక పోవడం గమనార్హం. “తమ డిమాండ్లను మంత్రుల కమిటీ ద్వారా సిఎంకు నివేదించామని, అయినా ప్రభుత్వం వైపు నుండి సానుకూల స్పందన రావడం లేదని తాము సమ్మెకు ఇప్పటికీ కట్టుబే ఉన్నామని మంత్రుల కమిటికి మరో సారి స్పష్టం చేశామని” అశ్వత్థామ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇదే అంశాన్ని ఆ కమిటి ద్వారా సిఎంకు తెలియజేయాలని సూచించామన్నారు. సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని బట్టి తమ స్పందన , లేదా కార్యాచరణను వెల్లడిస్తామని అశ్వత్థామ రెడ్డి అన్నారు.

Comments

comments