Home నాగర్ కర్నూల్ కేఎల్‌ఐ భూ సేకరణ అధికారుల పనితీరుపై మంత్రి ఆగ్రహం

కేఎల్‌ఐ భూ సేకరణ అధికారుల పనితీరుపై మంత్రి ఆగ్రహం

harish2*జగ్జీవన్‌రావు జయంతి వేడుకల్లో పాల్గొని నివాళ్ళు అర్పించిన మంత్రులు హరీశ్‌రావు, లకా్ష్మరెడ్డి, ఎంఎల్‌సి 

మనతెలంగాణ/కల్వకుర్తి:కల్వకుర్తి నియోజకవర్గంలో కేఎల్ ఐ 29వ ప్యాకేజి, డి82 పనులను గురువారం భారీ నీటి పారుదల శాఖ మంత్రులు హరీష్‌రావు, వైద్య ఆరోగ్య శాఖా మం త్రి లకా్ష్మరెడ్డి, ఎమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధుల అభ్యర్థి కసిరె డ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎంఎల్‌ఏ గువ్వల బాల్‌రాజ్ , నాగర్‌కర్నూల్ ఎంఎల్‌ఏ మర్రి జనార్దన్‌రెడ్డిలు మంత్రి పర్యట నలో పాలు పంచుకున్నారు. ముందుగా కల్వకుర్తి ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చిన మంత్రులకు కసిరెడ్డి నారాయణరెడ్డి , టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు విజయ్‌గౌడ్, నాయకు లు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పోలీ సులు వందన స్వీకారాన్ని మంత్రి స్వీకరించారు. అక్కడి నుం డి నేరుగా పాలమూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్‌రావు 111 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించా రు. అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. బాబు జగ్జీవన్ రావు దేశ ఉప ప్రధాని గా దళిత బహుజనుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అక్కడి నుండి జంగారెడ్డిపల్లి నుండి కొండా రెడ్డిపల్లి వరకు జరుగుతున్న కేఎల్‌ఐ, డి82 పనులను కాల్వల వెంబడి పర్యటించి పనులను పరిశీలించారు. జంగారెడ్డిపల్లి , కొండారెడ్డిపల్లి మద్యల భూ సేకరణ ఆలస్యంపై , పనుల నత్తనడకలపై అధికారులతో వివరాలు అడిగి జాప్యంపై మం త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిపల్లిలో సర్పంచ్ బన్నె శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అల్పాహరం స్వీకరించి అక్కడే గ్రా మ ప్రజలతో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. గ్రామానికి సీసీ రోడ్లు , పక్క గ్రామాలకు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రా మ అభివృద్ది కోసం ప్రత్యేక చొరవ చూపాలని మంత్రికి విన్న వించారు. గడువులోగా పనులు పూర్తి చేసే విధంగా అధికా రులు శ్రద్ద చూపడం లేదని అధికారులు, గుత్తందారులపై మండి పడ్డారు. అనంతరం కాల్వల వెంబడి ఆవాంఛ అక్విడేట్ వరకు భారీ కాన్వాయి కేఎల్‌ఐ అధికారులు , టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ఆయన వెంబడి ఉన్నారు. ఆయన వెంట ఎంపీపీ రామేశ్వరమ్మ, జెడ్పిటీసీ అశోక్‌రెడ్డి,నగర చైర్మన్ శ్రీశైలం, కౌన్సిలర్లు ఆనంద్‌కుమార్, సూర్యప్రకాశ్‌రావు, నీయీం,సీత్యానాయక్, లక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు కౌన్సిలర్లు , రైతు సంఘం నాయకులు సుదర్శన్‌రెడ్డి, కమీషనర్ ప్రవీన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.