Home తాజా వార్తలు బస్తీ దవాఖానాలపై మంత్రుల సమీక్ష

బస్తీ దవాఖానాలపై మంత్రుల సమీక్ష

Ministers Review on Basti Hospitals

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను విస్తరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే మంత్రులు కెటిఆర్, లక్ష్మారెడ్డిలు బస్తీ దవాఖానాల విస్తరణపై మంగళవారం అధికారులతో సమీక్ష చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు పాత జిల్లా కేంద్రాల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌లో 5, కరీంనగర్ పట్టణంలో 5, వరంగల్ పట్టణంలో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. వచ్చే వేసవి నాటికి హైదరాబాద్‌లో ఐదు వందల బస్తీ దవాఖానాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వారు తెలిపారు.

Ministers Review on Basti Hospitals