Search
Monday 24 September 2018
  • :
  • :

మణిరత్నం కార్యాలయంలో అగ్నిప్రమాదం

Mani-Ratnamచెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నైలోని అభిరామ్‌పురంలో గల మద్రాస్ టాకీస్ కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగిన్నట్టు తెలుస్తోంది. కార్యాలయ సిబ్బందితోపాటు చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయిన కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మణిరత్నం కార్తీ హీరోగా కట్రు వెలెయిదై అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని తన సొంత నిర్మాణ సంస్థ అయిన మద్రాస్ టాకీస్ బ్యానర్‌పైనే మణి నిర్మిస్తున్నారు.

Comments

comments