Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మైనర్‌గా అత్యాచారం.. పెళ్లి

 2008 లో 15 ఏళ్ల మైనర్‌గా ఉన్నప్పుడు ఆమె మీద అత్యాచారం జరిగింది. ఆ అత్యాచార ఫలితంగా బిడ్డ కూడా పుట్టింది. అప్పటి నుంచి కేసు నడుస్తోంది. ముద్దాయి ఆమెను పెళ్లి చేసుకుంటానని అనడంతో మద్రాసు హైకోర్టు, అతన్ని పెళ్లిచేసుకోమని ఆమెకు సలహా ఇచ్చింది. పోయిన ఏడాది జూన్‌లో న్యాయమూర్తి దేవదాసు నిందితుడినే ఆమెతో మధ్యవర్తిత్వం చేయడానికి పంపించారు. ‘ఇన్ని సంవత్సరాలు నేను ఎంత బాధ పడ్డానో జడ్జీకి ఏమన్నా అర్థమవుతుందా? ఆయనకి తెలుసు నాకు అత్యాచారం వలన బిడ్డ కలిగిందని అయినా ఒక చిన్న కోర్టు ఆర్డర్‌తో నేను అత్యాచారం జరిగినప్పుడు పడిన బాధని మళ్లీ అనుభవించమని చెప్తున్నారు’ కోర్టు ఆర్డర్‌ను తిప్పికొట్టింది. 

కేసు పూర్వాపరాలివి..
tamilnaduడిఎన్‌ఎ నమూనాల బట్టి కడలూరు కోర్టు అతన్ని ముద్దాయి అని తేల్చి 2014 లో రెండు లక్షల రూపాయలు జరిమానా విధించింది. అమ్మాయి అత్యాచారం జరిగి నప్పుడు మైనరు కాదు మేజర్ అని ఆమె ఇష్టపూర్వకంగానే తనతో ఉన్నదని చెప్పి మళ్లీ కోర్టులో కేసు ఫైల్ చేశాడు నిందితుడు. కేసు హైకోర్టుకు వెళ్లింది. కావాలంటే ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లికి ఆమె నిరాకరించడంతో న్యాయమూర్తి సెల్వమ్‌కు కింద కోర్టు పై మాటలు మాత్రమే విన్నారని ఆమె వయసును నిర్దారించే సర్టిఫి కేట్లు చూడలేదని అర్థమైంది. మైనర్‌తో సంప ర్కం అంటే అత్యాచారం కిందకే వస్తుంది కాబట్టి కేసును మళ్లీ కింది కోర్టుకు పంపిం చేసింది.
హైకోర్టు ఆమె కేసును కడలూరు కోర్టుకు పంపేసిన తర్వాత ఆమె సర్టిఫికెట్లను పరిశీ లించే కార్యక్రమం కొన్ని రోజులు జరిగింది. ఈక్రమంలో రెండు కోర్టుల నుంచి ఆమెకు అనుకూలంగా తీర్పు రాకపోవడం చూసి కేసు,కోర్టు యుద్ధాలతో విసిగిపోయి ఒకరోజు ఆమె బిడ్డను తీసుకుని కోర్టుకు వెళ్లి నేను అతన్ని పెళ్లి చేసుకుని అతనితో వెళ్లిపోతానని కోర్టుకి చెప్పింది. డిసెంబర్ 29 అతన్ని పెళ్లి చేసు కుంది.
‘ఆఖరున హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమె ఆశలను అడియాశలు చేసింది. నాకు ఉద్యోగం లేదు. తను నాకు బరువు అవదల్చుకోక ఆ నిర్ణయం తీసుకుంది. కేవలం కేసు నుంచి తప్పించుకోవడానికే అతను తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని ఆమెకి తెలుసు.’ అంటున్నాడు ఆమె అన్న. జరిగిన దానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జీ ఇలా అంటారు, ‘హైకోర్టు ఆమె డాక్యుమెంట్లను పరిశీలించి ఆమె వయసు నిర్ధారించి ఉండవల సింది. కాని కేసును వెనక్కి పంపి నిందితుడ్ని వదిలేసింది. తమిళంలో ఒక సామెత ఉంది, సాక్షి కాళ్ల మీద పడటం కంటే నిందితుడి కాళ్ల మీద పడటం మేలని. ఆమెకు కూడా అంతకంటే గత్యంతరం ఏమీ లేకపోయింది’ అని.

Comments

comments