Search
Monday 24 September 2018
  • :
  • :

దళితుల కాల్చివేత… 20 మందికి జీవిత ఖైదు

Mirchpur Dalits case, accused were sentenced to life imprisonment

హర్యానా : 2010, ఏప్రిల్ 21న అగ్రకులస్తులు దళితులపై దాడి చేసిన ఘటన హర్యానాలోని మిర్చ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ దాడిలో దళితులను కాల్చివేసిన కేసులో 20 మందికి ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అగ్రకులస్తులు దళితుల ఇళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో మానసిక స్థితి సరిగా లేని 17 ఏళ్ల అమ్మాయితో పాటు ఆమె తండ్రి మంటల్లో కాలి మృత్యువాత పడ్డారు. ఈ కేసులో ముగ్గురికి దిగువ కోర్టు ఇదివరకే జీవిత ఖైదు విధించింది. కాగా, శుక్రవారం ఢిల్లీ కోర్టు మరో 17 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

కేసు పూర్వపరాలు..
2010, ఏప్రిల్ 21న మిర్చ్‌పూర్ గ్రామంలోని దళిత కాలనీలో ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఓ కుక్క అరచింది. అయితే అగ్రకులానికి చెందిన వ్యక్తి కుక్కను రాయితో కొట్టాడు. దీంతో దళితులకు, అగ్రకులాల వారికి గొడవ జరిగింది. దీంతో కోపొద్రిక్తులైన అగ్ర కులాలు, దళితుల నివాసాలకు నిప్పు పెట్టారు. భయంతో దళితులు బయటికి పరుగులు పెట్టారు. అందరు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కానీ..? 17 ఏళ్ల అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మంటల్లో చిక్కుకుపోయింది. కూతురిని కాపాడుకునే క్రమంలో ఆమె తండ్రి కూడా మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. 254 దళిత కుటుంబాలు తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయాయి. మిర్చ్‌పూర్‌లో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి సిఆర్ పిఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. 2016 వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నాయి.

Comments

comments