Home జాతీయ వార్తలు జిమ్‌లో కాల్పులు.. ఆరేళ్ల బాలుడు మృతి

జిమ్‌లో కాల్పులు.. ఆరేళ్ల బాలుడు మృతి

Gunshot Firing

 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగులు జిమ్‌లోకి ప్రవేశించి కాల్పులు జరపడంతో ఆరేళ్ల బాలుడికి బులెట్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో జిమ్‌ యజమాని సోదరుడు కూడా గాయ పడ్డాడు. మృతి చెందిన చిన్నారి తన కుటుంబంతో కలిసి జిమ్‌ యజమాని ఫ్లాట్‌లోనే అద్దెకు నివాసం ఉంటున్నారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలిని  పరిశీలించి వివరాలు సేకరించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జిమ్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

Miscreants open fire at the gym in Delhi